విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: భీమవరం రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంట్ ఉండదని విద్యుత్ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. లోసరిలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రానికి లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనుల దృష్ట్యా గొల్లవానితిప్ప ఉపకేంద్రం పరిధిలోని లోసరి, దెయ్యాలతిప్ప, తోకతిప్ప, నాగేంద్రపురం తదితర గ్రామాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.