రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కోనసీమ: మండపేట పట్టణంలో డొక్కా సీతమ్మ మహిళా స్వశక్తి భవనం దగ్గరలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా పనులు త్వరగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.