‘బాలల హక్కులను పరిరక్షించాలి’

‘బాలల హక్కులను పరిరక్షించాలి’

AKP: బాలల హక్కులను పరిరక్షించాలని డీసీపీవో రమేష్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ మంజులవాణి అన్నారు. మంగళవారం పాయకరావుపేట పట్టణంలో విద్యార్థినులకు బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాలల హక్కులు పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. బాల్యవివాహాలను అరికట్టాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు.