ASHES: తక్కువ స్కోర్‌కే ఆస్ట్రేలియా ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌటైంది. 123/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 45.2 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కంగారూల జట్టు ఇప్పటికీ 40 పరుగుల వెనుకంజలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే.