నాయకత్వ మార్పుపై డీకే మరోసారి క్లారిటీ
కర్ణాటకలో నవంబరులో సీఎం మార్పు ఉండొచ్చన్న ప్రచారాన్ని మరోసారి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ప్రస్తుతానికి మరో నాయకుడిని వెతకాల్సిన అవసరం లేదని డీకే స్పష్టం చేశారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య లేదా తను చెబితేనే వార్తలను ప్రచురించాలని కోరారు. ఇటీవల సిద్ధరామయ్య కుమారుడు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.