కోసంగిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్
ASR: డుంబ్రిగూడ మండలం కోసంగి గ్రామంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్సై ఎల్.సురేష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఇవాళ నిర్వహించారు. 46 కుటుంబాలను తనిఖీ చేశారు. పాత గంజాయి నేరస్తులను గుర్తించి, రికార్డులు లేని మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి క్రయవిక్రయాలు చేయరాదని, చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.