వక్ఫ్ బోర్డు చైర్మన్‌తో ఎమ్మెల్యే చదలవాడ భేటీ
PLD: నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో వక్ఫ్ భూముల పరిరక్షణ, మైనార్టీల సంక్షేమంపై చర్చించారు. స్థానికంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ అజీజ్.. ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు.