చల్లా నిరసనపై స్పందించిన మాజీ డిప్యూటీ స్పీకర్

BPT: దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయడాన్ని నిరసిస్తూ గురువారం బాపట్లలో సెల్ టవర్ ఎక్కిన దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు చల్లా రామయ్యతో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఫోన్‌లో మాట్లాడారు. ఆయన నిరసనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట మురళితో మాట్లాడి అర్హుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని కోరారు.