కాలేజీలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ..!
CTR: గుడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది, ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ మాత్రలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడమే కాకుండా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని సిబ్బంది అవగాహన కల్పించారు.