VIDEO: బస్టాండ్‌లో అక్రమాలు.. స్థానికుల ఆవేదన
అన్నమయ్య: రాజంపేట పాత బస్టాండ్‌లో పరిస్థితులు రోజురోజుకీ అధ్వాన్నంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి, కడప రోడ్ల వద్ద ఆర్టీసీ బస్సులకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేట్ వాహనాలు ఆక్రమించడంతో బస్సులు నిలబడటానికే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బస్టాండ్‌లో క్రమబద్ధత తీసుకువచ్చి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.