రక్త పరీక్షలకు అంతరాయం లేదు: DMHO

రక్త పరీక్షలకు అంతరాయం లేదు: DMHO

WNP: వనపర్తి జిల్లా డయాగ్నస్టిక్స్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పరీక్ష పరికరాలు దెబ్బతిన్నప్పటికీ, రక్త పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేదని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. యథావిధిగా సమీప జిల్లాల్లోని టీ హబ్ కేంద్రాలకు నమూనాలు పంపి, అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలకు వైద్య సేవలు నిరంతరంగా అందుబాటులో ఉన్నాయని అన్నారు.