'సకాలంలో ఇంటి పన్ను చెల్లించాలి'

'సకాలంలో ఇంటి పన్ను చెల్లించాలి'

అన్నమయ్య: ప్రజలు సకాలంలో ఇంటి పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని చిట్వేలు మండల అభివృద్ధి అధికారి మోహన్ కోరారు. శనివారం చిట్వేలు MPDO కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ కార్యదర్శులు గ్రామాలలో ఇంటి పన్ను వసూలు చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారు నివాసం ఉన్న ఇంటికి పన్ను చెల్లించాలని, లేని యెడల వారికి నోటీసు ఇవ్వడం జరుగుతుందన్నారు.