'బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి'
VZM: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. శుక్రవారం ఓబీసీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన దొగ్గ దేవుడునాయుడును ఆమె పసుపుగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.