నూతన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
GDWL: లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రానికి చెందిన రేణుక, చాయిస్తాలకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వయంగా రిబ్బన్ కటింగ్ చేసి నూతన గృహాలను ప్రారంభించారు.