షెల్టర్ కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

SKLM: నరసన్నపేట మండల కేంద్రాలో 108 ద్వారా సేవలందిస్తున్న సిబ్బందికి సరైన వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సిబ్బంది రమణయ్య, రంగ ప్రసాద్ మాట్లాడుతూ..గతంలో ఎన్నోసార్లు అధికారులకు మొర పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి వసతి కల్పించాలని వినతి పత్రం సమర్పించారు.