హకీంపేటలో CISF పాసింగ్ అవుట్ పరేడ్

TG: హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో CISF రెండో బ్యాచ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల(ఏఎస్‌ఐ) పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఆరు నెలల కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న అనంతరం ఈ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CISF అడిషనల్ డైరెక్టర్ జనరల్(నార్త్) సుధీర్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.