గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

VZM: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కొల్లి పూర్ణచంద్రరావు అలియాస్ చందు అనే వ్యక్తిని గంట్యాడ మండలం గింజరు జంక్షన్ వద్ద అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు శుక్రవారం తరలించినట్లు ఎస్.ఐ సాయికృష్ణ చెప్పారు.