VIDEO: పాఠశాలకు డెస్క్ బెంచ్‌ల వితరణ

SRPT: మద్దిరాలలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో (1992-93) పూర్వ విద్యార్థులు రూ.25వేల విలువ గల డెస్క్ బెంచ్‌లను శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలకు అందజేశారు. దాతల దాతృత్వం అభినందనీయమని, పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని హెచ్ఎం మేడిపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులను అభినందించి శాలువాలతో సన్మానించారు.