పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్సై
సత్యసాయి: పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్బంగా పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సోమందేపల్లి ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సెంటర్‌కు 100 మీటర్ల లోపల జిరాక్స్ సెంటర్, బుక్ స్టాల్ పరీక్ష ముగిసే వరకు తెరవకూడదని అన్నారు. 100 మీటర్లలో ఉన్న టీ స్టాల్ యందు ఎవరిని కూర్చోబెట్టరాదని సూచించారు.