రేపు కోనేరులో స్నానం చేస్తే పుష్కర స్నాన ఫలం
NDL: మహానందిలో రేపు వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఇవాళ వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ పర్వదినాన రుద్రగుండం కోనేరులో గంగాదేవి స్వయంగా స్నానమాచరిస్తుందని శివపురాణం చెబుతోందని పేర్కొన్నారు. రేపు ఈ కోనేరులో భక్తులు స్నానం చేస్తే పుష్కర స్నాన ఫలం దక్కుతుందని ఆయన వివరించారు.