వెంకటేష్ పాత్రపై అనిల్ రావిపూడి కామెంట్స్

వెంకటేష్ పాత్రపై అనిల్ రావిపూడి కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా వెంకీ పాత్రపై రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, దాదాపు 20 నిమిషాలు కనిపిస్తాడని వెల్లడించాడు. ముఖ్యంగా చిరు, వెంకీ కలిసి నటించిన క్లైమాక్స్ సీన్స్ అభిమానులను బాగా అలరిస్తాయని అన్నాడు.