కావలిలో ఎరువుల దుకాణం తనిఖీ
NLR: కావలి పట్టణంలోని ఎరువుల దుకాణాలను డివిజనల్ వ్యవసాయ అధికారి నాగరాజు, కావలి ఏఓతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. యూరియా స్టాక్ పాయింట్‌ను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా అమ్మకాలను కొనసాగించాలన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు మాత్రమే అమ్మాలని సూచించారు.