ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు హాజరైన ఎమ్మెల్యే
KNR: మానకొండూర్ మండలం లలితాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామానికి చెందిన దాడి మమత-లక్ష్మణ్, వేల్పుల అయిలమ్మ, కాల్వ రమ్య-సతీష్‌లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వారు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని సోమవారం గృహప్రవేశాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.