VIDEO: లక్ష్మీ బ్యారేజ్‌లో భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం

VIDEO: లక్ష్మీ బ్యారేజ్‌లో భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం

BHPL: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం పెరుగుతుంది. ఆదివారం ఉదయం 5,66,160 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, సాయంత్రానికి 7,25,050 క్యూసెక్కులకు పెరిగిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 12 గంటల్లో 1.59 లక్షల క్యూసెక్కుల వరద పెరిగింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.