రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు
KRNL: ఆదోని విరుపాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన బైక్,ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హలిగెరకు చెందిన వ్యక్తి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.