విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు అందజేసిన రిటైర్డ్ పీఈటీ

విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు అందజేసిన రిటైర్డ్ పీఈటీ

NLG: గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రిటైర్డ్ పీఈటీ శీలం నారాయణ రెడ్డి రూ.45 వేల విలువ గల స్పోర్ట్స్ డ్రెస్ లను 110 మంది విద్యార్థులకు సోమవారం అందజేశారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటే తమ యొక్క లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనయ్య కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సత్కరించారు.