రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ELR: ఉంగుటూరు జాతీయ రహదారి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఉంగుటూరుకు చెందిన మానేపల్లి సత్యనారాయణ (75) రోడ్డు దాటుతుండగా ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్లే కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.