VIDEO: ఫెర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేసిన ఏడీఏ
SRPT: తుంగతుర్తిలోని పలు ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ దుకాణాలను ఏడీఏ రమేష్ బాబు బుధవారం తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్‌ను, రికార్డులను, లైసెన్సును పరిశీలించారు. రబీ సీజన్‌కు రైతులకు సరిపడా 100 నుంచి 120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, యూరియా కొరత లేదన్నారు. రైతుల ఆధార్ కార్డు తీసుకున్న తర్వాతే ఎరువులు విక్రయించాలన్నారు.