'హామీల అమలులో చంద్రబాబు విఫలం'
ప్రకాశం: సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడబిడ్డలకు ఇస్తానన్న రూ.1500 ఇవ్వలేక, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు.