వారం సంతల్లో ఆదాయం రూ.3.59 లక్షలు

వారం సంతల్లో ఆదాయం రూ.3.59 లక్షలు

అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వారం సంతల్లో మొత్తం రూ.3,59,250 ఆదాయం వచ్చినట్లు యార్డు ఎంపిక శ్రేని ఇంఛార్జ్ కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం గొర్రెలు, మేకలు సంతలో రూ.2,19,050 ఆదాయం రాగా, ఆదివారం పశువు సంతలో రూ.1,40,200 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. వచ్చిన ఆదాయన్ని ఇవాళ ప్రభుత్వ ఖాజానాకు జమ చేస్తామన్నారు.