VIDEO: నగరంలో జోరుగా వర్షం
వరంగల్ నగర వ్యాప్తంగా వర్షం జోరుగా కురుస్తోంది. నగరంలో తెల్లవారుజాము నుంచి వాతావరణం ముసురుతో ఉండగా, కొద్దిసేపటినుంచి వర్షం దంచికొడుతోంది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుండగా రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత బుధవారం కురిసిన కుండపోత వర్షానికి వరంగల్ అతలాకుతలమైన విషయం తెలిసిందే.