రసూల్‌పూర్ ఇకనుంచి శ్రీరామపురంగా పేరు మార్పు
VKB: తాండూరులో ఉగాది పర్వదినాన గ్రామ పేరును మార్చారు. పట్టణ సమీపంలో ఉన్న రసూల్‌పూర్ అభయాంనేయ స్వామి దేవాలయ ప్రాంతం కొత్త గ్రామంగా అవతరించింది. ఇవాళ రసూల్‌పూర్ గ్రామాన్ని ఆలయ పండితుల ఆధ్వర్యంలో శ్రీరాపురంగా నామకరణం చేశారు. ఈ మేరకు దేవాలయ సమీపంలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశారు.