పాక్‌కు ద్వివేది తీవ్ర హెచ్చరిక
పాక్‌కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని చెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద గ్రూపులకు మద్దతును కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద ముఠాలను ఉసిగొల్పటం మానుకోకపోతే ఆ దేశ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని తెలిపారు.