నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
BPT: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరగనుంది. ఈ విషయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు తాటి నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.