అందెశ్రీ మృతిపై వైద్యుల ప్రకటన
TG: అందెశ్రీ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. ఈరోజు ఉ.7:25కి ఆస్పత్రికి తీసుకురాగా.. గుండెపోటుతో అందెశ్రీ చనిపోయారని, అప్పటికే ఆయన మృతి చెంది ఐదు గంటలై ఉండవచ్చన్నారు. గత 15 ఏళ్లుగా ఆయనకు హైపర్ టెన్షన్ ఉందని, మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని అన్నారు. నెల రోజులుగా మెడిసిన్ వాడటం లేదని, వైద్యులను సంప్రదించలేదని పేర్కొన్నారు.