రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహన తనిఖీలు
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గుడివాడలో ఎస్సై నాగరాజు మంగళవారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలానాలను విధించారు.