అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలం: ఎమ్మెల్యే
ATP: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. గతంలో రెండుసార్లు వేతనాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు.