హిందూపురంలో టెన్షన్ వాతావరణం

హిందూపురంలో టెన్షన్ వాతావరణం

హిందూపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి హిందూపురానికి చేరుకున్నారు. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందుపురంలో పర్యటిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు.