VIDEO: 'మేకలు, గొర్ల అంగడిని సద్వినియోగం చేసుకోవాలి'
SRCL: మేకలు, గొర్ల అంగడిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బద్దెనపల్లి సర్పంచ్ సిలివేరి లావణ్య అన్నారు. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో మేకలు, గొర్ల అంగడిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యం కోసం బద్దెనపల్లిలో ఈ అంగడిని ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.