ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

GDWL: సాంప్రదాయ చేతి వృత్తుల వారు ఆర్థికంగా మరింత స్థిరపడేందుకు రూపొందించిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న చేతి, కుల వృత్తుల వారికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.