రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ
KNR: గంగాధర మండలంలో 2025-26 యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు MAO ఆర్.శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ పొందిన రైతులు 28-02-2026 వరకు డిజిటల్ సంతకం పూర్తి చేసిన వారు, ఇంతకుముందు పాస్ బుక్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేయని రైతులు, బ్యాంకు ఖాతా మార్చుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.