పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎస్పీ

పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎస్పీ

JGL: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఇబ్రహీంపట్నం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా అదనపు ఎస్పి శేషాద్రిని రెడ్డి సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆమె వెంట డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్సై ఉన్నారు.