80 విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు నిధులు మంజూరు

80 విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు నిధులు మంజూరు

KMM: సత్తుపల్లిలోని జవహర్ నగర్ కాలనీ, జంగాల కాలనీకి సుమారు 80 విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు మున్సిపాలిటీ నిధుల నుండి రూ.14.35 లక్షల విలువైన చెక్కును MLA మట్టా రాగమయి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ DE రాములు నాయక్ కు అందజేశారు. జంగాల కాలనీలో 40 ఇందిరమ్మ ఇళ్లతో పాటు 80 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయించడంతో కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.