కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

VZM: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై ఎస్.కోట మాజీ MLA కడుబండి శ్రీనివాసరావు మండిపడ్డారు. సోమవారం స్థానిక SG పేటలో 'బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపీ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా అందేవన్నారు.