సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

ప్రకాశం జిల్లా కొండపిలోని టంగుటూరులో సీసీ రోడ్ల విస్తరణ నిర్మాణ పనులను మంత్రి స్వామి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నేతలతో కలిసి సిమెంట్ రోడ్ల నాణ్యతను తనిఖీ చేశారు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా మండల టీడీపీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ జయంతి బాబు, తదితరులు పాల్గొన్నారు.