అయోధ్య రామమందిర నిర్మాణం ఇలా..

అయోధ్య రామమందిర నిర్మాణం ఇలా..

అయోధ్య రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేశారు. తాజాగా అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణతో ఆలయ నిర్మాణం పూర్తి అయినట్లు రామమందిర ట్రస్ట్ బోర్డు వెల్లడించింది. ఈ ఆలయాన్ని 2.77 ఎకరాలలో భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు.