జిల్లా కేంద్రంలో రేపు జాబ్ మేళా

జిల్లా కేంద్రంలో రేపు జాబ్ మేళా

WNP: వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా జరుగుతుందని ఆత్మకూర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సైదులు శుక్రవారం తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆదేశాల మేరకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ దీనిని నిర్వహిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్, ఒకేషనల్ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.