గాయత్రీ ఎస్టేట్ కూడలి కుదింపు వేగవంతం
KRNL: నగరంలోని గాయత్రీ ఎస్టేట్ కూడలి కుదింపు పనులు వేగవంతం చేసినట్లు నగరపాలక కమిషనర్ పీ.విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈ పనులను పరిశీలించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోందని, వీలైనంత వేగంగా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే రహదారుల విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.