VIDEO: ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత..మహిళా రైతుల ఆగ్రహం

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మండల కేంద్రాల్లోని యూరియా పంపిణీ కేంద్రాల వద్ద మహిళా రైతులు క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఇవాళ వారు మాట్లాడుతూ.. ఒక్క బస్తా యూరియా కోసం పొద్దంతా క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం స్పందించి యూరియా పంపిణీ చేయాలని కోరారు.