VIDEO: కార్యకర్తలను వ్యాఖ్యలను ఖండించిన కమిషనర్
కృష్ణా: ఉయ్యూరు మున్సిపాలిటీపై అసత్య, నిరాధారణ ఆరోపణలు చేస్తూ.. ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న ఒక సామాజిక కార్యకర్త వ్యాఖ్యలను మున్సిపల్ కమిషనర్ జరామారావు సోమవారం ఖండించారు. తెలిసీ తెలియక ఉద్యోగులపై నిందలు మోపడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల్లో అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని తెలిపారు.